YCP MLA Roja fired on AP CM Chandrababu Naidu saying he has no courage to face elections singly...that's why he met with Congress now.
#ysjagan
#mlaroja
#ChandrababuNaidu
#Lokesh
#Telanganaelections2018

చంద్రబాబుతో కలిసిన రాహుల్ గాంధీ ఇక బాబు ఇచ్చిన వీణనే వాయించుకుంటూ కూర్చోవాల్సి వస్తుందని వైసిపి ఎమ్మెల్యే రోజా ఎద్దేవా చేశారు. చిత్తూరు జిల్లా కేంద్రంలో ఇంచార్జి అరని శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్మించిన వైసీపీ పార్లమెంటు కార్యాలయం ప్రారంభోత్సవం బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు విచ్చేసిన వైసిపి ఎమ్మెల్యే రోజా ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ప్రజలను దారుణంగా మోసం చేసి గద్దెనెక్కారని ఆరోపించారు. తెలుగు పప్పు లోకేష్‌కు కాంగ్రెస్ పప్పు రాహుల్ తోడయ్యారని వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో జగన్‌ను గెలవకుండా చేయాలని చంద్రబాబు పవన్‌కళ్యాణ్ కాళ్లు పట్టుకున్నారని రోజా దుయ్యబట్టారు.